* తరలివచ్చిన అభిమానులు
ఆకేరు న్యూస్, విజయవాడ : విజయవాడ లెనిన్ సెంటర్ లో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కృష్ణ మనవడు జయకృష్ణ, సోదరుడు ఆదిశేషగిరారావు లెనిన్ సెంటర్లో కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. కృష్ణ నటించిన చిత్రం అగ్నిపర్వతం విడుదలై 45 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని అభిమాన సంఘాలు, కుటుంబ సభ్యులు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన అభిమానులతో లెనిన్ సెంటర్ కిక్కిరిసింది. కృష్ణ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. విజయవాడ నగరంతో కృష్ణకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా ఆదిశేషగిరిరావు గుర్తు చేశారు. తాత కృష్ణ విగ్రహాన్ని ఇంతటి ప్రాముఖ్యం ఉన్న సెంటర్ లో నెలకొల్పడం గర్వంగా ఉందని, తాతగారిపై ఉన్న అభిమానాన్ని చూసి ఉప్పొంగిపోయారు. తెలుగు చిత్ర పరిశ్రమకు కృష్ణ చేసిన సేవలను వక్తలు కొనియాడారు. కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, కేశినేని చిన్ని, రఘురామకృష్ణరాజు, బోండా ఉమ, బుద్దా వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
………………………………………………………………

