* మాజీ ఎంపీ వినోద్ కుమార్
ఆకేరు న్యూస్ హనుమకొండ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త కార్మిక చట్టాల సవరణలపై మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాము మార్పును వ్యతిరేకించే వ్యక్తులం కాదని అయితే, ఆ మార్పు ఎప్పుడూ ప్రజల ప్రయోజనం కోసమే జరగాలని ఆయన స్పష్టం చేశారు.అభివృద్ధి వైపు అడుగులు వెయ్యాలి అన్నారు.చట్టాల్లో మార్పులు అనేవి వ్యవస్థను మెరుగుపరచాలి, మార్పు ఎప్పుడూ అభివృద్ధి వైపే ఉండాలి అని ఆయన పేర్కొన్నారు. గతంలో కార్మికులకు రక్షణ కల్పించే అనేక చట్టాలు ఉండేవని, ఇప్పుడు వాటన్నింటినీ క్రోడీకరించి నాలుగు లేబర్ కోడ్లుగా తీసుకువచ్చారని గుర్తు చేశారు. గతంలో 100 మంది కంటే ఎక్కువ కార్మికులు ఉన్న పరిశ్రమల్లో వారిని తొలగించాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా ఉండేదని అన్నారు. ప్రస్తుతo 300 మందికి పెంచారని, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి కార్మికులకి ఇంకా మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పి ఇప్పుడు అంటే దాన్ని దాదాపుగా అన్ని ఫ్యాక్టరీలలో 300 పైగా ఎక్కడ కూడా కనిపించడం లేదని అన్నారు. .దీనివల్ల మెజారిటీ ఫ్యాక్టరీల్లో యాజమాన్యాలకు అధికారాలు దక్కుతాయని, యజమాని ఎప్పుడు కావాలంటే అప్పుడు కార్మికులను పనిలో నుంచి తీసివేసే అవకాశం ఉందని అన్నారు .చట్టాలు అనేవి కార్మికులకు రక్షణగా ఉండాలి తప్ప, వారిని ఇబ్బందులకు గురిచేసేలా ఉండకూడదని వినోద్ కుమార్ అన్నారు. అంటే యజమాని రేపటి నుంచి మీరు వద్దు వెళ్లిపోవండి అని అంటే వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఎంపీ అరవింద్ అన్నారు.
…………………………………………………

