* తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలవుతున్న బాధితులు
* రోడ్లపై వేలాడుతూ వాహనదారుల మెడకు చుట్టుకుంటున్న మాంజా
* వర్దన్నపేటలో బైక్ పై వెళ్తున్న వ్యక్తకి తీవ్ర గాయాలు
ఆకేరు న్యూస్ , హైదరాబాద్ : సంక్రాంతి పండుగ వేళ పతంగి ప్రియుల ఉత్సాహం కొంత మంది ప్రాణాలకు ముప్పుగా మారింది. మార్కెట్లో నిషేధించిన చైనా మాంజాను దొంగచాటుగా అమ్ముతున్నారు. దీంతో పతంగి ప్రియులు యథేచ్ఛగా చైనా మాంజాతో పతంగులను ఎగురవేస్తున్నారు. పతంగులను ఎగురవేసే క్రమంలో తెగిపడిన మాంజా చెట్లతో పాటు వివిధ ప్రాంతాల్లో వేలాడుతూ రోడ్లపై ప్రయాణిస్తున్న వాహనదారులకు మృత్యుదారంగా మారుతోంది. కొంత మంది చూడకుండా మాంజా బారిన పడుతుంటే మరికొంత మంది దారమే కదా అని యథాలాపంగా పోతూ మాంజాకు బలి అవుతున్నారు. రహదారులపై వేటాడుతున్న మాంజా వాహనదారుల శరీరానికి తగిలి తీవ్రంగా గాయపరుస్తోంది. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగరంలో చాలా మంది బాంజా బారిన పడి ఆస్పత్రి పాలవుతున్నారు. తాజాగా నల్లకుంట పోలీస్ స్టేషన్లో ఏఎస్ ఐగా పనిచేస్తున్న నాగరాజు రహదారిపై వేలాడుతున్న మాంజాతో మెడకు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చేరారు. అంతకు మందు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సూర్య తేజా, సాయి వర్ధన్ రెడ్డి , పాత బస్తీలో ఓ డెలివరీ బాయ్,
వర్ధన్నపేటలో …
వర్ధన్నపేట పట్టణంలో బైక్ పై వెళ్తున్న వ్యక్తి మాంజా గొంతుకు తాకి తీవ్ర రక్త సావంతో ఆస్పత్రిలో చేరాడు.
…………………………………………………………………..

