* తమిళ సంస్కృతిపై మోదీ దాడి చేస్తున్నారని ట్వీట్
ఆకేరు న్యూస్, డెస్క్ : ఇటీ వలే రాజకీయాల్లోకి ప్రవేశించి తమిళగ వెట్రి కజగం పార్టీ ని స్థాపించిన తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన జననాయగన్ సినిమా సెన్సార్ కానందున వాయిదా పడిన విషయం తెల్సిందే తాజాగా ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ సినిమాను అడ్డుకోవడం అంటేనే తమిళ సంస్కృతిపై దాడి చేయడమే అని రాహుల్ అన్నారు.ఈ మేరకు ఆయన మంగళవారం ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘ ‘జననాయగన్’ సినిమాను అడ్డుకోవడం ద్వారా కేంద్ర సమాచార, ప్రసార శాఖ తమిళ సంస్కృతిపై దాడి చేస్తోంది. మోదీ గారు.. తమిళ ప్రజల్ని అణచివేయాలనే మీ ప్రయత్నాలు సఫలం కావు’’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవడం వల్లే ఈ సినిమా వాయిదా పడిందని చిత్ర యూనిట్, తమిళ సినిమా వర్గాలు అంటున్నాయి.
తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా విజయ్ కు మద్దతు తెలిపారు.
………………………………………..

