* ఎన్టీవి జర్నలిస్ట్ లు మరో ఇద్దరిని కూడా..
* నేడు మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచే అవకాశం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ ఎన్టీవీ సీనియర్ జర్నలిస్ట్, ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం అర్దరాత్రి వేళ పోలీసులు దొంతు రమేష్ ను ఆయన ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఇదే కేసులో ఎన్టీవీకి చెందిన మరో ఇద్దరు సీనియర్ రిపోర్టర్లైన పరిపూర్ణా చారి, సుధీర్లను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముగ్గురినీ నేడు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంది .
ఎందుకీ అరెస్ట్ లు ..?
ఎన్టీవీలో ప్రసారమైన కథనంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , ఒక ఐఏఎస్ లను ఉద్దేశించి ఒక వార్తా కథనం ప్రసారం చేశారు.. అందులో అధికారి వ్యక్తిగత ప్రతిష్ఠ ను దిగజార్చే విదంగా ఉందని ఐఏఎస్,ఐపీఎస్ అధికారుల సంఘం పోలీసులకు ఫిర్యాదు చేసింది .ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపధ్యంలో ఐఏఎస్ అసోసియేషన్ కంప్లైంట్ దాఖలు చేసింది. కాగా ఐఏయస్ ,ఐపీఎస్ అధికారులు తీవ్ర స్థాయిలో స్పందించడం తో ప్రభుత్వం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో దర్యాప్తు కోసం ‘ సిట్ ‘ ఏర్పాటు చేసింది. దర్యాప్తు లో భాగంగా జర్నలిస్ట్ ల అరెస్ట్ లు జరిగాయి..
………………………………………….

