* కోర్టులో తేల్చుకుంటాం
* అడ్డదిడ్డంగా ప్రశ్నలు అడిగారు
– సీనియర్ జర్నలిస్ట్ దొంతు రమేశ్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేశారు. పోలీసులు అడ్డదిడ్డంగా ప్రశ్నలు అడిగారు. అయినప్పటికీ కోర్టులో తేల్చుకుంటాం. తప్పకుండా ఈ అరెస్ట్ లకు సంబందించి తప్పకుండా మాట్లాడుతానని సీనియర్ జర్నలిస్ట్, ఎన్టీవీ ఇన్ పుట్ ఎడిటర్ దొంతు రమేశ్ అన్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న ఎన్టీవీ జర్నలిస్ట్లు దొంతు రమేశ్, సుధీర్ ను కింగ్ కోఠి ఆస్పత్రి లో వైద్య పరీక్షల కోసం తీసుకొచ్చిన సందర్భంగా విలేకరులు ఆ ఇద్దరితో మాట్లాడే ప్రయత్నం చేశారు. పోలీసులు అందుకు అవకాశం కల్పించలేదు. అయినప్పటికీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అరెస్టయిన దొంతు రమేష్ మాట్లాడుతూ ఇదీ అక్రమ అరెస్ట్ .. తప్పనిసరిగా అరెస్ట్ గురించి బయటకు వచ్చిన తర్వాత మాట్లాడుతాను అన్నాడు.. సుధీర్ మాట్లాడుతూ ఎలాంటి సంబందం లేకపోయినా కేసులు పెట్టారు.. అని మాట్లాడుతుండగానే పోలీసలు బలవంతంగా తీసుకెళ్లారు. అనంతరం ఈ ఇద్దరు జర్నలిస్ట్ లను సీసీఎస్కు తరలించారు.

