ఆకేరు న్యూస్, ములుగు: మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయ పునరుద్ధరణ (ప్రారంభోత్సవం) సందర్భంగా మేడారం చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, తదితరులకు స్వాగతం పలికిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ధనసరి సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, దొంతి మాధవ రెడ్డి, డాక్టర్ మురళి నాయక్, యశస్విని రెడ్డి, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, స్టేట్ ఫైనాన్స్, ఆయిల్ ఫెడ్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, జంగా రాఘవరెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటిడిఏ పి.ఓ. చిత్రా మిశ్రా, తదితరులున్నారు.మొదట సిఎం పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు.మేడారం పోలీస్ కమాండ్ కంట్రోల్ లో సీసీ కెమెరాల అనుసంధానం, డ్రోన్ కెమెరాల పనితీరు పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పరిశీలించారు. మేడారం మహా జాతర భద్రతా ఏర్పాట్ల వివరాలు సిఎం అధికార్లు ను అడిగి తెలుసుకుంటున్నారు. సీసీ కెమెరాలు, ఎఐ టెక్నాలజీ పనితీరును ముఖ్యమంత్రికి పోలీస్ ఉన్నతాధికారులు వివరించారు.
………………………………………………..

