ఆకేరు న్యూస్, కమలాపూర్ : హుజురాబాద్ – పరకాల ప్రధాన రహదారిపై గల ఉప్పల్ రైల్వే గేట్ పై నిర్మించిన ఉప్పల్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం త్వరలో పూర్తిస్థాయిలో వాహనదారులకు, ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. రెండు ఆర్ఓబి ల లో ఒకవైపు ఆర్ఓబి నిర్మాణం పూర్తయి, వాహనదారుల రాకపోకలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. రెండోవైపు ఉండే ఆర్ఓబి నిర్మాణం కూడా పూర్తయింది.ఈ హుజురాబాద్ వైపు వెళ్లే ఆర్ఓబి నిర్మాణం సంబంధించి పనులు ముగిసి నెల రోజులకు పైగా కావస్తుందని కాంట్రాక్టర్ సుబ్బారెడ్డి అన్నారు. ఆర్ఓబి బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయినప్పటికీ, ఆర్ఓబిని కలపాల్సిన 18 మీటర్ల ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం ఆలస్యమవడంతో క్యూరింగ్ కి కొన్ని రోజులపాటు సమయం పట్టనుంది. ఆ తర్వాత పూర్తిస్థాయిలో హుజురాబాద్ వైపు వెళ్లే ఆర్వోబి పై వాహనదారుల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. మిగిలిన పెయింటింగ్, హైట్ గేజ్ నిర్మాణాలు చక చక పూర్తవుతున్నాయి. కాగా రెండవ ఆర్ఓబి పూర్తయ్యేసరికి ఇంకొంత కాలం సమయం పట్టనుంది.
……………………………………………..
