– మంచి కంటెంట్ చేయండ్రి. పైసల కోసం జనాన్ని దోచుకోకండ్రి
– చట్టాన్ని లైట్ తీసుకుంటే చివరకు సీన్ సితార్ అయితది.
– లక్కీ డ్రా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన హైదరాబాద్ సీపీ సజ్జనర్
ఆకేరు న్యూస్, కమలాపూర్ : కర్మ ఎవ్వర్నీ ఇడిసిపెట్టదు, యాది పెట్టుకోండ్రి అని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి సి సజ్జనర్ ఎక్స్ లో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో కొందరిని నమ్మి జనాలు ఫాలో అవుతున్నారు. లక్కీ డ్రా అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్లు ఏదన్నా మంచి కంటెంట్ చేయండ్రి, ఖర్మ ఎక్కడికో ఎత్తుకపోయి, మల్లా గొయ్యి తీసి పూడ్చేస్తది! చేసేది మోసం అని మీ మనసుకి తెల్సు కదా? పైసల కోసం జనాన్ని మాత్రం దోచుకోకండ్రి, చట్టాన్ని లైట్ తీసుకుంటే చివరకు సీన్ సితార్ అయితది అని సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు. కార్లు, బైకులు, ప్లాట్లు, డీజేలు ఇస్తామంటూ ఆకర్షణీయ ప్రకటనలతో అమాయకులను మోసం చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు సీపీ సజ్జనార్.
……………………………………………
