ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
జనగామ జిల్లా చిల్పూర్ మండలం చిల్పూర్ గుట్ట శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవస్థాన నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి శుక్రవారం వచ్చారు. మా పార్టీ (బీఆర్ఎస్) ఎమ్మెల్యే కడియంను కలసి పార్టీ కండువాతో స్వాగతం పలకాలని వచ్చిన బీ ఆర్ ఎస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ తాటికొండ రాజయ్యను చిల్పూర్ గుట్ట శివారులో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన వెనుతిరిగి పోయారు.
“మళ్లీ మొదలైన కాంగ్రెస్…. బీఆర్ఎస్ ఫ్లెక్సీ వార్…..
ఎమ్మెల్యే చిల్పూర్ కు రావడం టిఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి అడ్డుకుంటారన్న ప్రచారం జరగడంతో మండల కేంద్రంలో శుక్రవారం ఉదయం ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే కడియం శ్రీహరికి భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు స్వాగతం సుస్వాగతం అంటూ నినాదాలు చేయడామె కాకుండా మల్కాపూర్, రాజవరం, వెంకటాద్రి పేట లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎలాంటి ఘర్షణలు జరగకుండా ముందస్తుగా వాళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఫ్లెక్సీలను పోలీసులు తొలగించారు.
‘భారీ బందోబస్తు
ఏసీపీ భీమ్ శర్మ ఆధ్వర్యంలో రఘునాథపల్లి సిఐ శ్రీనివాస్ రెడ్డి, వేణు, సబ్ ఇన్స్పెక్టర్లు 80 మంది పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు ఎలాంటి అవాంఛన్య సంఘటన జరగకుండా ముందస్తుగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు

Please tell us what is wrong. Your report will be sent to the website team.
