Published:
ఆకేరున్యూస్, మేడారం : నేడు మేడారంలో మండమెలిగే పండుగ నిర్వహించనున్నారు పూజారులు. మేడారం, కన్నెపల్లిలోని ఆలయాల్లో వనదేవతల పూజా సామాగ్రి శుద్ధి చేయనున్నారు. అనంతరం మేడారంలో అష్టదిగ్బంధనం నిర్వహణ ఉంటుంది. ఈ రోజు, రేపు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కాగా.. మేడారం మహా జాతర జనవరి 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరగనుంది. జనవరి 28న సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్ద రాజులు గద్దెలకు చేరుకుంటారు. 29న చిలకలగుట్ట నుంచి సమ్మక్క దేవత గద్దపైకి వస్తారు. 30న అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకోగా,, జనవరి 31న దేవతల వన ప్రవేశం జరుగుతుంది. ఇంతటితో జాతర ముగుస్తుంది.
…………………………………………..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
