ఆకేరు న్యూస్, ములుగు: ములుగు మండలానికి చెందిన పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క క్యాంపు కార్యాలయంలో గురువారం లబ్ధిదారులకు అందజేశారు. పలు అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది ఆర్థికంగా బాధపడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తులు చేసుకున్న ములుగు మండలానికి చెందిన 8 మంది లబ్ధిదారులకు సుమారు 10 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందచేశారు. మంత్రి సీతక్క వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్ ,ములుగు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎండీ చాంద్ పాషా ,ములుగు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చింతనిప్పుల బిక్షపతి ,ములుగు మాజీ ఎంపీటీసీ మావురపు తిరుపతి రెడ్డి ,మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లెల్ల భరత్ కుమార్,జిల్లా కార్యదర్శి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
…………………………………………………….
