ఆకేరు న్యూస్, ములుగు: ములుగు పట్టణ కేంద్రంలో పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో మహిళా కమ్యూనిటీ నూతన భవనాన్ని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారత కోసం పనిచేస్తుందని, మహిళల కోసం ప్రత్యేకంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, మహిళా సంఘాల ద్వారా వడ్డీలేని రుణాలు అందిస్తున్నామని, ప్రతి ఒక్కరూ మహిళా సంఘాల్లో చేరాలని మంత్రి సూచించారు. ప్రభుత్వం మహిళా సంఘాలఅభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఆర్థిక పథకాలను సద్వినియోగపర్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి మహిళా సంఘాల నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

…………………………………………….
