* రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
ఆకేరు న్యూస్, హైదరాబాద్: రాష్ట్ర జంతు సంక్షేమ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. జంతు సంరక్షణ చట్టాల అమలు తీరుపై పూర్తి వివరాలతో ఎలా జరుగుతుందన్న అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని పేర్కొంది. రాష్ట్రంలో జంతు సంరక్షణ చట్టాలు సక్రమంగా అమలు కావడంలేదని అన్నారు. పెంపుడు జంతువుల దుకాణాలు బ్రీడింగ్ సెంటర్లు, కబేలాలను తనిఖీలు చేయడంతో పాటు చట్టాలు అమలయ్యేలా ఆదేశాలను జారీ చేయాలని పేర్కొన్నారు. హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్ ఇండియా సంస్థ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరిష్ కుమార్ సింగ్,జస్టిస్ మొహియుద్దీన్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కొన్ని కీలక అంశాలను కోర్టు ప్రస్తావించింది. రాష్ట్ర జంతు సంక్షేమ బోర్డు గడువు, 2022 లోనే ముగిసిపోయినప్పటికీ కొత్త బోర్డును ఎందుకు ఏర్పాటు చేయాలని వారు ప్రశ్నించారు. నిబంధనల అమలును పర్యవేక్షించేందుకు రిటైర్డ్ జడ్జితో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. గతేడాది జనవరిలో సంక్షేమ బోర్డులో ఆనాధికార సభ్యుల నియమకానికి దరఖాస్తులు ఆహ్వానించారు,తప్ప ఇప్పటివరకు ప్రక్రియ ముందుకు సాగలేదని వారు వాపోయారు.బోర్డులో అనధికార సభ్యుల నియామకం కోసం గతేడాది జనవరిలోనే దరఖాస్తులు ఆహ్వానించినప్పటికీ, ఆ ప్రక్రియ ఇంతవరకు ముందుకు సాగలేదని వివరించారు. నిబంధనల ప్రకారం బోర్డును ఏర్పాటు చేసి, రిటైర్డ్ జడ్జితో కూడిన కమిటీ ద్వారా చట్టాల అమలును పర్యవేక్షించాలని పిటిషనర్ కోరారు. దీనిపై ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ స్పందిస్తూ.. పూర్తి వివరాలతో అదనపు కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని కోరారు.తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
…………………………………………………………
