* వివాదంలో నటి టీనా శ్రావ్య
ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారానికి వన దేవతల దర్శనం కోసం వచ్చిన కమిటీ కుర్రోళ్ళు చిత్రంలో నటించిన శ్రావ్య తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. బుధవారం రోజున తన పెంపుడు జంతువు అయినటువంటి కుక్కకు బంగారం(బెల్లం)తో తులాభారం చేసి ఆ ఫోటోలు వీడియోలు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. షేర్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.. ఆ వీడియోలను చూసిన భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇది ఖచ్చితంగా భక్తుల మనోభావాలను దెబ్బతీయటమేనని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మర్నాడు దీనిపై శ్రావ్య సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చి.. తన పెంపుడు జంతువుకి ఆరోగ్యం బాగా లేకపోతే ఆరోగ్యం కుదుటపడగానే ఎత్తు బంగారం ఇస్తానని గతేడాది అమ్మవారికి మొక్కినట్లు తాను చెప్పారు. తను కేవలం భక్తితో మాత్రమే ఆ మొక్కులు తీర్చానని ఎలాంటి సాంప్రదాయాలను కించపరిచే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. తన వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటే తనను క్షమించాలని విజ్ఞప్తి చేశారు.
………………………………………..
