ఆకేరు న్యూస్, హన్మకొండ: ధర్మసాగర్ ఫైరింగ్ రేంజ్లో పోలీసుల ఫైరింగ్ సాధన.. పాల్గొన్నవరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ మరియు ఉన్నతాధికారులు..వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీసుల వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్ కార్యక్రమం ధర్మసాగర్‌లోని ఫైరింగ్ రేంజ్ ప్రారంభమైంది. పోలీస్ శాఖ ఏటా నిర్వహించే శిక్షణలో భాగంగా, రెండు రోజుల పాటు జరిగే ఈ ఫైరింగ్ సాధనలో ఏఆర్ (AR) మరియు సివిల్ పోలీసులు పాల్గొన్నారు.వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ స్వయంగా ఫైరింగ్ ప్రాక్టీస్‌లో పాల్గొని అధికారులకు దిశానిర్దేశం చేశారు.డీసీపీలు అంకిత్ కుమార్, DCP ధార కవిత, రాజమహేంద్ర నాయక్, అదనపు డీసీపీలు, ఏసీపీలు, సీఐలు మరియు ఎస్సైలు వివిధ రకాల తుపాకులతో శిక్షణ పొందారు.రాబోయే రోజుల్లో ఈ ఫైరింగ్ రేంజ్‌ను మరింతగా మెరుగుపరిచి, శిక్షణకు అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీపీ అధికారులతో చర్చించారు.ఫైరింగ్ సాధనలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులకు రివార్డులు అందజేయనున్నట్లు ఉన్నతాధికారులు ప్రకటించారు.శిక్షణా కార్యక్రమంలో ఏసీపీలు శుభం, చేతన్, ట్రైనీ ఐపీఎస్ మనీషా నేప్రా, అదనపు డీసీపీలు సురేష్ కుమార్, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.
………………………………………………..
