ఆకేరు న్యూస్ , డెస్క్ : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన ఉద్యోగులకు మరోసారి చేదు వార్త చెప్పబోతోంది. సంస్థలోని మేనేజ్మెంట్ ను తగ్గించి, పనితీరును వేగవంతం చేసే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కంపెనీలో అవసరానికి మించి మేనేజ్మెంట్ లేయర్స్ పెరిగిపోయాయి. దీనివల్ల పనిలో జాప్యం జరుగుతోంది. వీటిని తగ్గించి కంపెనీ సంస్కృతిని కాపాడటమే మా లక్ష్యం,” అని జస్సీ స్పష్టం చేశారు.వచ్చే మంగళవారం నుంచే ఈ తొలగింపులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. గతంలో 2022 చివరలో, 2023 ప్రారంభంలో అమెజాన్ సుమారు 27,000 మందిని తొలగించింది. సుమారు 14,000 మందికి పైగా కార్పొరేట్ ఉద్యోగులు ఈ విడతలో ప్రభావితం కానున్నారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS), రిటైల్, ప్రైమ్ వీడియో మరియు హెచ్ఆర్ (HR) విభాగాలు.ఇది ఆర్థిక సంక్షోభం వల్లనో, AI వల్లనో చేస్తున్న కోతలు కావని.. సంస్థలో పెరిగిపోయిన బ్యూరోక్రసీని (అదనపు మేనేజ్మెంట్ స్థాయిలు) తగ్గించడమే తమ లక్ష్యమని సీఈఓ ఆండీ జస్సీ స్పష్టం చేశారు.గత అక్టోబర్లో అమెజాన్ సుమారు 14,000 మందిని తొలగించింది. తాజా నిర్ణయంతో కలిపి మొత్తం 30,000 మంది కార్పొరేట్ ఉద్యోగులను తొలగించాలనే లక్ష్యాన్ని కంపెనీ చేరుకోనుంది. ప్రస్తుతం అమెజాన్ కార్పొరేట్ విభాగంలో ఉన్న 3.5 లక్షల మందిలో సుమారు 10 శాతం మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని నివేదికలు చెబుతున్నాయి..అయితే, ఈ కోతల పరిధి ఎంత ఉంటుంది? అనేది ఇంకా ఒక స్పష్టతకు రాలేదని, పరిస్థితులకు అనుగుణంగా మార్పులు ఉండవచ్చని తెలుస్తోంది.పాత విడతలో తొలగించిన ఉద్యోగులకు ఇచ్చిన 90 రోజుల గడువు ముగియనుండగానే, కొత్త విడత లేఆఫ్స్ వార్తలు రావడం అమెజాన్ ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది.
…………………………………………………………….
