వరుస సెలవుల నేపథ్యంలో సికింద్రాబాద్, కాచిగూడ నుంచి ప్రత్యేక రైళ్లు
– ఈ ప్రత్యేక రైళ్లలో అన్ని సెకండ్ జనరల్ క్లాస్ కోచ్‌లు
ఆకేరు న్యూస్, కమలాపూర్ : మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వివిధ ప్రాంతాలనుంచి వచ్చి వెళ్లే అశేషమైన భక్తులకు వారి సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే 28 జన సాధారణ రైళ్లను నడపనుంది. దక్షిణ మధ్య రైల్వే భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన, సాఫీగా ప్రయాణించేలా కీలక మార్గాల్లో 28 జనసాధరణ (రిజర్వ్ చేయని) ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.ఈ ప్రత్యేక రైళ్లలో అన్ని సెకండ్ జనరల్ క్లాస్ కోచ్‌లు ఉండనున్నాయి.
ప్రత్యేక రైళ్ల వివరాలు
సికింద్రాబాద్ – మంచిర్యాల్ – సికింద్రాబాద్ మధ్య
జనవరి 28,30 ఫిబ్రవరి 1 మూడు రోజులు జనసాధరన్ ప్రత్యేక రైళ్లు (06 సర్వీసులు) రైలు నెం. 07495/07496 నడవనున్నాయి.
ఈ ప్రత్యేక రైళ్లు మౌలా అలీ, చర్లపల్లి, ఘట్కేసర్, బీబీనగర్, భోంగీర్, వంగపల్లి, ఆలేరు, పెంబర్తి, జనగాం, రఘునాథపల్లి, ఘన్పూర్, పిండియాల్, కాజీపేట్ జంక్షన్, వరంగల్, హసన్‌పర్తి రోడ్, ఉప్పల్, జమ్మికుంట, బిసుగిరీషరీఫ్, పలు రైల్వే స్టేషన్లో ఆగనున్నాయి.
సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్‌నగర్ – సికింద్రాబాద్
జనవరి 28,30 ఫిబ్రవరి 1 మూడు రోజులు జనసాధరణ (04 సర్వీసులు) ప్రత్యేక రైలు నెం. 07497/07498 నడవనున్నాయి.
ఈ ప్రత్యేక రైళ్లు మౌలా అలీ, చర్లపల్లి, ఘట్కేసర్, బీబీనగర్, భోంగీర్, వంగపల్లి, ఆలేరు, పెంబర్తి, జనగాం, రఘునాథపల్లి, ఘన్పూర్, పిండియాల్, కాజీపేట్ జంక్షన్, వరంగల్ (రివర్సల్-1), హసన్‌పర్తి రోడ్డు, ఉప్పల్, జమ్మికుంట, బిసుగీర్, పెద్దపల్లి, రాఘవపురం, రామగుండం, పెద్దంపేట్, మంచిర్యాల్, రవీంద్రఖని, బెల్లంపల్లి, రెచ్చిరోడ్డు, ఆసిఫాబాద్ రోడ్డు స్టేషన్ల లో ఆగనున్నాయి.
నిజామాబాద్ – వరంగల్ – నిజామాబాద్
జనవరి 28 – 31 వరకు జనసాధరణ ప్రత్యేక రైళ్లు రైలు నెం. 07499/07500 సర్వీసులు 08 నడవనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లు కామారెడ్డి, అకనాపేట్, మీర్జాపల్లి, వడియారం, మనోహరాబాద్, మేడ్చల్, బోలారం, మౌలాఅలీ జి క్యాబిన్, చర్లపల్లి, ఘట్కేసర్, బీబీనగర్, భోంగీర్, వంగపల్లి, ఆలేరు, జనగాం, రఘునాథపల్లి, ఘన్పూర్, పిండియాల్, కాజీపేట స్టేషన్లలో ఆగనున్నాయి.
కాజీపేట – ఖమ్మం – కాజీపేట
జనవరి 28, 29, 30 తేదీలలో జనసాధరణ ప్రత్యేక రైళ్లు రైలు నెం: 07504/07503 (08 ట్రిప్పులు) నడవనున్నాయి
ఈ ప్రత్యేక రైళ్లు వరంగల్, చింతల్‌పల్లి, నెక్కొండ, కేసముద్రం, మహబూబాబాద్, గుండ్రాతిమడుగు, గార్ల, డోర్నకల్, పాపటపల్లి, మల్లెమడుగు స్టేషన్లలో ఆగనున్నాయి.
ఆదిలాబాద్ – కాజీపేట్ – ఆదిలాబాద్
జనవరి 28 న ఆదిలాబాద్ – కాజీపేట్ కి, జనవరి 29 న కాజీపేట్ – ఆదిలాబాద్ కి జనసాధరన్ రైలు నెం: 07501/07502 ప్రత్యేక రైళ్లు (02 ట్రిప్పులు) నడవనున్నాయి
ఈ ప్రత్యేక రైళ్లు అంబారి, కిన్వాట్, ధనోరా దక్కన్, సహస్రకుండ్, హిమాయత్‌నగర్, హద్గావ్ రోడ్, భోకర్, ముద్ఖేడ్, ఉమ్రి, ధర్మాబాద్, బాసర్, నిజామాబాద్, ఆర్మూర్, మోర్తాడ్, మెట్పల్లి, కోరుట్ల, లింగంపేట్ , జగిత్యాల్, గంగాధరన్, కరీంనగర్, శంకరపల్లి, గంధరపల్లి, ఇరువైపులా జమ్మికుంట, ఉప్పల్, హసన్‌పర్తి రోడ్డు స్టేషన్ల యందు ఆగనున్నాయి.

…………………………………………………
