* నాలుగు రోజుల్లో వర్షాలు
ఆకేరున్యూస్, హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు కేరళను తాకినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. నాలుగైదు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది. దీంతో వర్షాలు ప్రారంభంకానున్నాయి. మరోవైపు రెమాల్ తుపాను తర్వాత భానుడు ఉగ్రరూపం దాల్చడంతో రెండు రోజులుగా రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. రాత్రి ఉష్ణోగ్రతలు పగటి ఉష్ణోగ్రతలతో పోటీ పడుతున్నాయి. మరో వైపు ఏపీలో ఇవాళ పొడి వాతావరణం ఉంటుందని, ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరుగుతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు శ్రీకాకుళం, మన్యం, అనకాపల్లి, పల్నాడు, నెల్లూరు, ప్రకాశం, నంద్యాల, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, తిరుపతి, శ్రీసత్యసాయి. అల్లూరి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. కాగా, నేడు కేరళలో వర్షాలు దంచికొడుతున్నాయి. పలు రాష్ట్రాలకు అక్కడి వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
———————-