ఆకేరు న్యూస్, ధర్మసాగర్: వేలేరు మండలం పీచర గ్రామంలో జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను కడియం శ్రీహరి మరియు సంబంధిత అధికారులు అక్కడి సర్పంచ్ తో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు కమిటీ చైర్మన్ సర్పంచులు కలిసికట్టుగా పనిచేయాలని అలాగే సమ్మక్క సారలమ్మ జాతరను విజయవంతంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే అన్నారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ ఈ మినీ మేడారంలో భక్తులకు కచ్చితంగా మెరుగైన వసతులు సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. జాతర అయిపోయే వరకు అధికారులు అక్కడే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించాలని సూచించారు. జాతరకు అవసరమైనంత నీటి సదుపాయం విద్యుత్ సదుపాయం కల్పించాలని ఎలాంటి అంతరాయం కలగకుండా దానికి అవసరమైనటువంటి నిధులను మంజూరు చేయిస్తానని తెలిపారు. పోలీసులు పకడ్బందీగా భద్రత చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా పనిచేసే జాతరను విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్, విద్యుత్ ,గ్రామీణ నీటి సరఫరా, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు ,కమిటీ చైర్మన్లు ,సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
…………………………………………..
