* వాజేడులో గన్ మిస్ ఫైర్.. ఇద్దరు CRPF జవాన్లకు తీవ్ర గాయాలు!
ఆకేరు న్యూస్ ,వాజేడు: ములుగు జిల్లాలో ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. వాజేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని CRPF క్యాంపులో గన్ మిస్ ఫైర్ కావడంతో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.వాజేడులోని CRPF క్యాంపులో జవాన్లు తమ ఆయుధాలను శుభ్రం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో UGBL (Under Barrel Grenade Launcher) అనే అత్యాధునిక రకం గన్ ఒక్కసారిగా మిస్ ఫైర్ అయ్యింది. గన్ క్లీన్ చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా పేలుడు సంభవించడంతో అక్కడే ఉన్న ఇద్దరు జవాన్లు ప్రమాదానికి గురయ్యారు.ఈ ప్రమాదంలో జవాన్ల వీపు, భుజం మరియు నడుము భాగాల్లో బలమైన గాయాలైనట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి వారు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే తోటి సిబ్బంది స్పందించి బాధితులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.స్థానిక ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం, గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు వారిని మెరుగైన చికిత్స కోసం ములుగు జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి అత్యవసర విభాగంలో చికిత్స అందుతోంది.
………………………………………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
