మున్సిపల్ ఛైర్మన్ తూనం శ్రావణ్ కుమార్
* నియమనిష్ఠలు, భక్తి, ఆత్మనియంత్రణకు ప్రతీక అయ్యప్ప దీక్ష
* మున్సిపల్ ఛైర్మన్ తూనం శ్రావణ్ కుమార్
ఆకేరు న్యూస్, తొర్రూరు: అయ్యప్ప దీక్ష (Ayyappa Deeksha) నియమనిష్ఠలు, భక్తి, ఆత్మనియంత్రణతో పాటు సమాజంలో సోదరభావం, సమానత్వాన్ని పెంపొందించే గొప్ప ఆధ్యాత్మిక మార్గమని తొర్రూరు మున్సిపల్ ఛైర్మన్ తూనం శ్రావణ్ కుమార్ అన్నారు.
పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో మంగళవారం నిర్వహించిన మహాపడిపూజ (Maha Padi Pooja), భిక్ష కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పవిత్ర భిక్ష కార్యక్రమంలో పాల్గొంటున్న అయ్యప్ప స్వాములకు శుభాకాంక్షలు తెలిపారు. ఆలయంలో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
భిక్ష స్వీకరిస్తున్న ప్రతి అయ్యప్ప స్వామిపై ఆ స్వామివారి కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి ఇంటా సుఖశాంతులు, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో 10వ వార్డు కౌన్సిలర్ ముద్దసాని సురేష్, నాయకులు రాజేందర్, బిజ్జాల అనిల్, శ్రీనివాస్, దారం ప్రసాద్, శేఖర్, బిజ్జల రమణ, రాజేష్ యాదవ్, అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

