Srimathi Movie
* పెళ్లి తర్వాత ఆమె జీవితంలో ఎలాంటి మార్పులు..?
* డిసెంబర్ 4 నుంచి జీ5లో స్ట్రీమింగ్!
ఆకేరు న్యూస్, సినిమా : నటి నివేదా థామస్, తిరువీర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘శ్రీమతి’ (Srimathi Movie). విశ్వక్ ఖండేరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ఆసక్తిని పెంచింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. కుటుంబ నేపథ్యంలో సాగే సన్నివేశాలు, ఆసక్తికరమైన పాత్రలు, భావోద్వేగాలతో ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
* పెళ్లి తర్వాత నివేదా జీవితంలో ఎలాంటి మార్పులు?
ట్రైలర్లో ముఖ్యంగా నివేదా థామస్ పాత్ర అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పెళ్లి తర్వాత భర్త, అత్తింటి వారు ఆశించే విధంగా అణిగిమణిగి ఉండే భార్యగా మారేందుకు ఆమె ఎదుర్కొనే ఇబ్బందులను ఇందులో చూపించారు. ఈ క్రమంలో తనలో చోటుచేసుకునే మార్పులు, భావోద్వేగ సంఘర్షణలను ఆసక్తికరంగా ఆవిష్కరించారు. దీంతో సినిమా కథపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది.
* డిసెంబర్ 4 నుంచి జీ5లో స్ట్రీమింగ్
కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో హరితేజ, గోపరాజు రమణ, విజ్జి చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, రాజశ్రీ, ఐశ్వర్య భాస్కరన్, సుదర్శన్, విరాజ్ అశ్విన్, మానిక చిక్కాల తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఆదిత్య జవ్వాది సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, రవితేజ గిరిజాల ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ.ఎల్. విశ్వనాథ్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ నిర్మాణంలో, జీ5 సౌత్ ఒరిజినల్‌గా రూపొందిన ‘శ్రీమతి’ (Srimathi Movie) డిసెంబర్ 4, 2026 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది.
Also Read : ‘ఫ్యామిలీ ప్యాక్’ టీజర్ విడుదల!

Please tell us what is wrong. Your report will be sent to the website team.

