* వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ వెల్లడి
ఆకేరు న్యూస్, వరంగల్: చిన్నారుల బంగారు భవిష్యత్తును చిదిమేస్తున్న బాల కార్మిక వ్యవస్థపై వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఉక్కు పాదం మోపారు . ‘ఆపరేషన్ స్మైల్ 12’ కార్యక్రమంలో భాగంగా , మొత్తం 179 మంది చిన్నారులను వెట్టిచాకిరీ నుంచి విముక్తి చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ (CP)సన్ ప్రీత్ సింగ్ వెల్లడించారు.జనవరి 1 నుండి 31 వరకు వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లోని పారిశ్రామిక ప్రాంతాలు, షాపులు, ఇటుక బట్టీల్లో తనిఖీలు నిర్వహించారు.మొత్తం 179 మందిలో 150 మంది బాలురు, 29 మంది బాలికలు ఉన్నారు.బాలలతో పని చేయించుకుంటున్న 51 మంది యజమానులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.విముక్తి పొందిన వారిలో తెలంగాణతో పాటు బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, అస్సాం రాష్ట్రాలకు చెందిన 87 మంది చిన్నారులు ఉన్నారు.యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగం, చైల్డ్ హెల్ప్ లైన్, కార్మిక శాఖ మరియు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కూడిన తొమ్మిది ప్రత్యేక బృందాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. బాలల హక్కులను కాపాడటంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఎక్కడైనా బాలకార్మికులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన సూచించారు.ఈ ఆపరేషన్ను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన అడిషనల్ డీసీపీ ఎన్.రవి, ఏహెచ్టీయూ సీఐ జె.శ్యామ్ సుందర్ మరియు ఇతర సిబ్బందిని సీపీ అభినందించారు.
………………………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
