* రూ. 2 లక్షల విలువైన బంగారం అప్పగింత…
ఆకేరు న్యూస్, నర్సంపేట: ప్రయాణికులు మర్చిపోయిన విలువైన బంగారు ఆభరణాలను క్షేమంగా తిరిగి అప్పగించి, ఒక ఆర్టీసీ కండక్టర్ తన నిజాయితీని చాటుకున్నారు.వరంగల్ జిల్లా నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ కండక్టర్ యాకూబ్ పాషా, ఆదివారం ఉదయం నర్సంపేట నుంచి హన్మకొండకు వెళ్లే బస్సులో విధుల్లో ఉన్నారు. ఆ సమయంలో బస్సులోని ఒక సీటు వద్ద సుమారు రూ. 2 లక్షల విలువైన బంగారు గొలుసు, ఉంగరం ఉన్న పర్సును ఆయన గమనించారు.బాధిత ప్రయాణికురాలు తన నగలు పోగొట్టుకున్నట్లు గుర్తించి ఆందోళనతో బస్టాండ్‌కు చేరుకోగా, కండక్టర్ యాకూబ్ పాషా ఆ సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేశారు. అనంతరం డిపో మేనేజర్ సమక్షంలో సదరు మహిళకు నగలను క్షేమంగా అప్పగించారు.కండక్టర్ యాకూబ్ పాషా చూపిన ఈ నిజాయితీని ఆర్టీసీ అధికారులు, తోటి సిబ్బంది మరియు స్థానికులు ప్రత్యేకంగా అభినందించారు.
……………………………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
