* వైరల్ అవుతున్న కానిస్టేబుల్ ఆవేదన…
ఆకేరు న్యూస్, డెస్క్:కర్ణాటకకు చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్ తన ఉద్యోగ బాధ్యతలపై చేసిన వాట్సాప్ స్టేటస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. పోలీసు వృత్తిలోని ఒత్తిడిని భరించలేక, ఈ ఉద్యోగం కంటే బండి మీద ఎగ్ రైస్ అమ్ముకోవడం మిన్న అని ఆయన పేర్కొన్నారు.కర్ణాటక రాష్ట్రం, కొప్పళ జిల్లాలోని హనుమసాగర పోలీస్ స్టేషన్.బ్రహ్మానందం గద్ది అనే కానిస్టేబుల్.పోలీసు శాఖలో ఏడాదిలో 365 రోజులూ పని ఉంటుందని, కనీసం ఒక్క రోజు కూడా సెలవు దొరకని పరిస్థితి ఉందని ఆయన వాపోయారు.కొత్తగా పోలీసు ఉద్యోగాల్లో చేరాలనుకునే వారు వంద సార్లు ఆలోచించుకోవాలని, ఇతర శాఖల్లో చేరడం ఉత్తమమని సలహా ఇచ్చారు.ఈ పోస్టుపై దళిత సంఘం నాయకుడు హనుమప్ప ముదెనూరు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, సదరు కానిస్టేబుల్‌పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.పోలీసుల పని ఒత్తిడిపై ఈ ఘటన మరోసారి చర్చకు దారితీసింది.
…………………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
