మినీ మేడారం అగ్రం పహాడ్ జాతరలో పెరిగిన హుండీ ఆదాయం రూ. 64.48 లక్షలు!
ఆకేరు న్యూస్,వరంగల్: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర అనుబంధ జాతరగా పరిగణించే అగ్రంపహాడ్ జాతర ఆదాయం భారీగా పెరిగింది. ఇటీవల ముగిసిన ఈ జాతరకు సంబంధించి భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపు మంగళవారం ముగిసింది.అగ్రంపహాడ్ సమ్మక్క-సారలమ్మ ఆలయ హుండీల ద్వారా ఈసారి రూ. 64,48,850 ఆదాయం సమకూరింది.గత జాతరతో పోలిస్తే ఈసారి ఆదాయం రూ. 3,56,154 మేర పెరగడం విశేషం.భక్తులు కేవలం రూపాయిలే కాకుండా విదేశీ కరెన్సీని కూడా మొక్కులుగా చెల్లించారు. ఇందులో 64 హుండీల ద్వారా అమెరికా, ఇథియోపియా, సౌదీ అరేబియా, మలేషియా దేశాలకు చెందిన డాలర్లు మరియు ఇతర కరెన్సీ నోట్లు లభ్యమయ్యాయి.తాడ్వాయి మండలంలోని అగ్రంపహాడ్ వద్ద ఈ లెక్కింపు ప్రక్రియ జరిగింది. సోమవారం ఆలయ హుండీలను కట్టుదిట్టమైన భద్రత మధ్య వరంగల్లోని వెంకటేశ్వర స్వామి దేవాలయానికి తరలించారు. మంగళవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం వరకు దేవాదాయ శాఖ అధికారులు మరియు స్వచ్ఛంద సేవకుల సమక్షంలో లెక్కింపు పూర్తి చేశారు.ఈ జాతరకు భక్తుల తాకిడి పెరగడం వల్ల ఆదాయంలో కూడా గణనీయమైన వృద్ధి కనిపించిందని దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ నాగేశ్వరరావు వెల్లడించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
