Tirumala Devotees Rush
Tirumala News : సర్వదర్శనానికి 15 గంటల సమయం
ఆకేరు న్యూస్, తిరుమల: శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోవడంతో భక్తులు వెలుపల ఏర్పాటు చేసిన క్యూలైన్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ప్రస్తుతం 15 గంటల సమయం పడుతోంది.
నిన్న శ్రీవారిని 90,842 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటూ 39,852 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా శ్రీవారికి రూ.4.66 కోట్ల ఆదాయం సమకూరింది.భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ అధికారులు క్యూలైన్లలో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. దర్శనం కోసం వచ్చే భక్తులు ఓపికగా ఉండాలని, టీటీడీ సూచనలు పాటించాలని అధికారులు కోరుతున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
