Edla Ashok Reddy
Telangana Liberation Day: ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్పూర్: సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర నాయకులు ఎడ్ల అశోక్‌రెడ్డి డిమాండ్ చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో బీజేపీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అశోక్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం ద్వారా చరిత్రను భావితరాలకు తెలియజేయాలని అన్నారు. ప్రభుత్వం సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని కోరారు.
సమావేశంలో జిల్లా ఎస్సీ మోర్చా మాజీ అధ్యక్షులు ప్రదీప్, చిల్పూర్ మండల అధ్యక్షులు గంటె ఉపేందర్ యాదవ్, జఫర్ఘడ్ మండల అధ్యక్షులు కోరుకొప్పల నగేష్ గౌడ్‌తో పాటు నాయకులు పాలకుర్తి సోమశేఖర్ గుప్తా, మధు, తౌటిరెడ్డి రాజేశ్వరరెడ్డి, రాజేష్‌రెడ్డి, రమేష్, అనిల్, రాజు, శివ, సంపత్ తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
