* ఆధారాలు చూపలేకపోయారన్న స్పీకర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌పై దాఖలైన అనర్హత పిటిషన్ ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టివేశారు. బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారిన మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత్ పిటిషన్ ను వేశారు. కొద్ది రోజులుగా స్పీకర్ వారికి నోటీసులు ఇచ్చి విచారణ చేస్తున్నారు. ఇప్పటికే 8 మంది పిటిషన్లను కొట్టివేశారు. వారు పార్టీ మారినట్లు ఆధారాలు లేకపోవడంతో కొట్టివేసినట్లు ప్రకటించారు. ఇప్పుడు తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ను విచారించారు. ఆయన కూడా పార్టీ మారినట్లు ఆధారాలను చూపలేకపోవడంతో ఆయనపై వచ్చిన పిటిషన్‌ను కూడా కొట్టివేశారు. దీంతో మొత్తం 8 మంది పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనర్హత పిటిషన్ పై కూడా విచారణ జరుగుతోంది. దీనిపై స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది. తాను బీఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే అని, తన జీతం నుంచి ప్రతి నెలా రూ.5000 పార్టీకి కట్ అవుతున్నాయని ఎమ్మెల్యే సంజయ్ తెలిపారు. తాను జగిత్యాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిపి పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు.
………………………………………
