ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్: మున్సిపల్ ఎన్నికల్లో పోటీపడుతున్న అభ్యర్థుల్లో అభివృద్ధి చేసే వారికి పట్టం కట్టాలని వరంగల్ పార్లమెంటు సభ్యురాలు కడియం కావ్య పిలుపునిచ్చారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 6,7,8,9,10,11 వార్డులలో గురువారం అభ్యర్థులతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను నియోజకవర్గంలో అమలు చేస్తుందన్నారు. ప్రత్యేకంగా మున్సిపాలిటీ ఏర్పాటుతోపాటు 18 వార్డుల్లో అభివృద్ధి పనుల కోసం 50 కోట్లు మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని 18 వార్డులను సిసి రోడ్లు, డ్రైనేజీలు, నీటి సరఫరా, విద్యుత్తు, వీధి దీపాలు మొదలైన సమస్యలు లేకుండా అభివృద్ధి పథంలో ముందుకు సాగుదాం అన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాంబాబు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ లావణ్య ఇన్చార్జిలు అన్నం బ్రహ్మారెడ్డి, బేబీ శ్రీనివాస్, గుజ్జరి రాజు, తీగల కరుణాకర్ రావు, మార్కెట్ వైస్ చైర్మన్ ఐలయ్య, హిమబిందు, పోగుల సారంగపాణి, జగదీష్ చందర్ రెడ్డి అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.
