* రేవంత్ రెడ్డికి హరీశ్‌రావు సంచలన సవాలు
ఆకేరు న్యూస్, సంగారెడ్డి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌రావు సంచలన సవాలు చేశారు. సిగాచీ బాధితులకు రేవంత్ రెడ్డి రూ.కోటి పరిహారం ఇప్పిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. సంగారెడ్డిలో జరుగుతున్న మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. సిగాచి పరిశ్రమలో 54 మంది చనిపోతే ఎవరూ రాలేదని, ఘటన జరిగిన వెంటనే తాను వచ్చి పరిశీలిస్తే, తర్వాత సీఎం రేవంత్ వచ్చారని గుర్తు చేశారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు ఇస్తానని చెప్పి, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. కంపెనీ రూ.25 లక్షలు ఇచ్చింది కానీ, రేవంత్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. ప్రజలను ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పాలని హరీశ్ అన్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ కూడా పేదల, కార్మికుల పక్షపాతి అని ఆరోపించారు.
………………………………..
