* యజమానికి తెలియకుండానే విక్రయం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : అది టీ కొట్టు. కానీ అందరూ టీ తాగడానికే వస్తారనుకుంటే పొరబడినట్లే. ఎందుకంటే అక్కడ గంజాయి కూడా అమ్ముతున్నారు. దాని కోసమే కొందరు యువత అక్కడ టచ్చాడుతుంటారు. బతుకుదెరువు కోసం నగరానికి వచ్చానంటూ టీ స్టాల్లో పనికి కుదిరిన యువకుడు దుకాణ యజమానికి తెలియకుండానే గంజాయి దాచి విక్రయిస్తుండడం కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. నారాయణ్‌ఖేడ్‌కు చెందిన ఉద్యానాథ్, హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో టీ దుకాణంలో పనిచేస్తున్నాడు. తనకున్న పరిచయాలతో బీదర్ నుంచి గంజాయి తెప్పించి, స్కూటీలో దాచుతున్నాడు. టీ తాగేందుకు వచ్చిన కొంతమందితో పరిచయం పెంచుకొని వారికి గంజాయి విక్రయిస్తున్నాడు. చిన్న ప్యాకెట్ గంజాయి రూ. 500 చొప్పున కస్టమర్లకు ఇస్తున్నాడు. ఇతడి దందాపై పక్కా సమాచారమందుకున్న రంగారెడ్డి ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ సిబ్బంది గంజాయి విక్రయిస్తుడంగా అరెస్ట్ చేశారు. అతడి నుంచి కేజీ గంజాయి, స్కూటీని స్వాధీనం చేసుకున్నారు.
