* పశ్చిమ బెంగాల్ లో కలకలం
* ఎన్నికల సంఘం సీరియస్
ఆకేరు న్యూస్ డెస్క్ : సార్వత్రిక ఎన్నికల సమరం ఏడో దశ పోలింగ్ లో కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రధానంగా పశ్చిమ బెంగాల్ లో ఈవీఎంలు చెరువులో కనిపించడం కలకలం రేపింది. ఈనేపథ్యంలో కోల్‌కతా జయనగర్ పోలింగ్ బూత్ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలింగ్ ఏజెంట్లు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారన్న ఆరోపణలతో తమూ కూడా పోలింగ్ బూత్‌ల్లో కూర్చుంటామని పలువురు ఓటర్ల పట్టు పట్టారు. అందుకు అధికారులు నిరాకరించడంతో ఓటర్లు ఆగ్రహంతో ఈవీఎంలను తీసుకెళ్లి చెరువులో విసిరేశారు. జావద్‌పూర్ పోలింగ్ కేంద్రంలోనూ ఇదే పరిస్థితి నెలకొన్నట్టు తెలుస్తోంది. ఉద్రికక్త పరిస్థితుల నేపథ్యంలో కోల్‌కతాలో పోలీసులు భారీగా మోహరించారు. దీనిపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. నిందితుల అరెస్ట్ కు ఆదేశాలు జారీ చేసింది. అయితే.., అది పోలింగ్ ప్రారంభానికి ముందే జరిగిన ఘటన అని, కొత్త ఈవీఎంలతో పోలింగ్ కొనసాగుతోందని స్థానిక అధికారులు వెల్లడించారు. కాగా.. ఏడో దశలో ఉదయం 11 గంటల వరకు దాదాపు 26.30 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిసింది.
———————-