* మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ
* అగ్రనేత వికాస్ లొంగుబాటు
ఛత్తీస్‌గఢ్: మావోయిస్టు పార్టీకి మరో పెద్ద షాక్ తగిలింది. ఒడిశా రాష్ట్ర పార్టీ కార్యదర్శి, వరంగల్ జిల్లా తరాలపల్లి కి చెందిన అగ్ర నాయకుడు ముప్పిడి సాంబయ్య అలియాస్ వికాస్ ఛత్తీస్‌గఢ్ పోలీసుల ముందు లొంగిపోయారు.వికాస్‌తో పాటు మరో 15 మంది కీలక మావోయిస్టులు కూడా ఆయుధాలతో సహా జనజీవన స్రవంతిలో చేరారు. వీరంతా మహాసముంద్ జిల్లాలో లొంగిపోయినట్లు సమాచారం.
*నిధుల కొరత, ఆరోగ్య సమస్యలు*
పార్టీలో అంతర్గత విభేదాలు, అగ్రనేతల అనారోగ్య సమస్యలు మరియు నిధుల కొరత కారణంగానే వీరు లొంగిపోయినట్లు తెలుస్తోంది.
లొంగిపోయిన వారి నుండి పోలీసులు పెద్ద సంఖ్యలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.వికాస్ లొంగుబాటుతో ఒడిశాలో మావోయిస్టుల కార్యకలాపాలు మరింత బలహీనపడే అవకాశం ఉంది.ఈ సామూహిక లొంగుబాటు మావోయిస్టు ఉద్యమానికి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
