Palakurthi SGFI Kabaddi
* జిల్లా స్థాయిలో ద్వితీయ రన్నరప్..
* వరంగల్ జిల్లా జట్టుకు ఇద్దరి ఎంపిక
ఆకేరు న్యూస్, పాలకుర్తి:
జనగామ జిల్లా కేంద్రంలో నిర్వహించిన 20వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SGFI) జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రగతి విద్యాలయం విద్యార్థులు సత్తా చాటారు. కబడ్డీ పోటీల్లో పాఠశాల జట్టు ద్వితీయ రన్నరప్ ట్రోఫీని సాధించింది.
పోటీల్లో ప్రతిభ కనబరిచిన పాఠశాల విద్యార్థులు జి. కార్తీక్, జి. రామ్ చరణ్ ఉమ్మడి వరంగల్ జిల్లా కబడ్డీ జట్టుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను, వారికి శిక్షణ అందించిన వ్యాయామ ఉపాధ్యాయులను పాఠశాల కరెస్పాండెంట్ వీరమనేని వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయ బృందం అభినందించారు.
చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించడం అభినందనీయమని కరెస్పాండెంట్ పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ విజయం సాధించి పాఠశాలకు, ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
