Harish Rao on 22A Lands
* రైతులకు న్యాయం చేయాలని డిమాండ్..
* సీఎం ఇళ్లపై కీలక వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్: 22A భూముల అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 22A జాబితా కారణంగా ఎంతోమంది రైతులు, భూ యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అసెంబ్లీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తమ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ఆరోపణలు చేశారని విమర్శించారు. 22A జాబితాలో తప్పుగా రైతుల భూములను చేర్చిన విషయాన్ని మంత్రి స్వయంగా అంగీకరించారని హరీశ్‌రావు పేర్కొన్నారు. అయితే బాధిత రైతులకు క్షమాపణలు చెప్పలేదని అన్నారు. 22Aలో ఎన్ని ఎకరాల భూములను చేర్చారో ప్రభుత్వం స్పష్టంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు.
* సీఎం ఇళ్లూ 22Aలోనే..
ముఖ్యమంత్రి ఇళ్లు కూడా 22A జాబితాలో ఉన్నాయని హరీశ్‌రావు ఆరోపించారు. సీఎం ఇళ్లను 22A నుంచి ఎప్పుడు తొలగిస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు.
* మామ భూములపై వివరణ
గజ్వేల్ నియోజకవర్గంలో తన మామకు భూములు ఉన్నాయని, వాటిని కొనుగోలు చేసిన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉందని హరీశ్‌రావు తెలిపారు. తన మామ రిటైర్డ్ బ్యాంక్ అధికారి అని చెప్పారు. ప్రభుత్వం చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే తనపై ఆరోపణలు చేస్తున్నారని హరీశ్‌రావు విమర్శించారు. 22A జాబితాలోని తప్పులను సరిదిద్ది, బాధిత రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
