Published:
Updated: 18 Mar 2026 • 06:07 AM
ఆకేరు న్యూస్, కమలాపూర్:
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని ఉప్పల్ లో మంగళవారం మధ్యాహ్నం వృద్ధురాలి మెడలోంచి గుర్తు తెలియని వ్యక్తి పుస్తెలతాడు ఎత్తుకెళ్లిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. కమలాపూర్ పోలీస్ ఇన్స్పెక్టర్ నవీన్ తెలిపిన వివరాల ప్రకారం…. ఒంటరిగా నివసిస్తున్న మారపల్లి రుక్మిణమ్మ మధ్యాహ్నం తన ఇంట్లో వంట చేసుకుంటుండగా గుర్తు తెలియని దుండగుడు ఆమె మెడలో ఉన్న మూడు తులాల మూడు గ్రాముల పుస్తెలతాడును లాక్కొని పారిపోయాడు.ఈ ఘటనపై కమలాపూర్ పోలీసులు విచారణ జరిపి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
