Mandal-Level Prajavani Launched in Kamalapur Every Monday
* ప్రతి సోమవారం ఉదయం 10:00 మధ్యాహ్నం 1:00 వరకు
ఆకేరు న్యూస్, కమలాపూర్:
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రతి సోమవారం ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎంపీడీవో కార్యాలయం సర్క్యులర్ జారీ చేసింది.
ప్రభుత్వ ఉత్తర్వులు , జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత వికేంద్రీకరించి, ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రజావాణికి తహసీల్దార్, ఎంపీడీవో, ఎంపీఓ, వ్యవసాయ, వైద్య, విద్య, పోలీసు, పంచాయతీ రాజ్ తదితర 27 శాఖల మండల స్థాయి అధికారులు విధిగా హాజరుకావాలని ఆదేశించారు.
అంతేకాకుండా, ప్రజావాణి నిర్వహణలో భాగంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు, ఎస్ హెచ్జీల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
