ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
అటుకెక్కిన 6 గ్యారంటీలు, అమలుకు నోచని 420 హామీలతో కాలం వెలదీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పై అడుగడుగునా పోరాటాలు నిర్వహిస్తామని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య హెచ్చరించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూడుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ ఎస్సీలకు ఒరిగింది ఏమీ లేదు అన్నారు.
స్పీకర్ గడ్డం ప్రసాద్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సాంఘిక సంక్షేమ మంత్రి లక్ష్మణ్ కుమార్, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దళిత మంత్రులు నలుగురు ఉండి మూడుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ ఎస్సీలకు మాత్రం మూడు నామాలు పెట్టడం జరిగిందన్నారు. దళితుల సంక్షేమానికి హక్కుల పరిరక్షణ కోసం ఒక్క కార్యక్రమం కూడా చేపట్టలేదు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తన సామాజిక వర్గం సహకరించినప్పటికీ దళితుల ఓట్ల ద్వారానే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, ముఖ్యమంత్రిని అయ్యానని చెప్పినప్పటికీ దళితులకు వరగబెట్టింది ఏమీ లేదు, ఎన్నికలకు ముందు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో చేవెళ్ల డిక్లరేషన్ లో దళితులకు 18 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చిన ఫలితం శూన్యం అన్నారు. దళిత బంధు పేరు మార్చి అంబేద్కర్ అభయహస్తం పేరుమీద 12 లక్షల రూపాయలు ఇస్తానన్న రేవంత్ రెడ్డి బడ్జెట్లో మాత్రం గుండు సున్నా మిగిలించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మాదిగలకు అన్యాయం చేస్తూ మాలల పక్షపాతిగా నిలుస్తూ ఎంపీ, 5 ఎమ్మెల్సీలు ప్రకటిస్తే ఒక్కటి కూడా మాదిగలకు ఇవ్వలేదు, రాజ్యసభ మొదలగు పదవులలో దళితులకు కేటాయించింది ఒక్కటంటే ఒక్క పదవి కూడా లేదు. నోటితో నవ్వి నొసలుతో ఎక్కిరించినట్లుగా ఉంది రేవంత్ రెడ్డి పాలన అని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు ప్రకటించిన ఎస్సీ, ఎస్టి, బిసి డిక్లరేషన్లు అమలుకు నోచలేదన్నారు. ఎన్నికల హామీలు అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగే వరకు ఉద్యమిస్తానన్నారు. ఈ సమావేశంలో కౌన్సిలర్ తాటికొండ మధు, మాజీ సర్పంచ్ తాటికొండ సురేష్, ఆకార అశోక్, ఎండి జాఫర్, చింత శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
