Rajinikanth Jailer 2 movie OTT Deal ₹160 Crore
ఆకేరు న్యూస్, హైదరాబాద్:
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్2 చిత్రానికి ఓటీటీ హక్కుల విషయంలో భారీ డీల్ కుదిరినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు సుమారు రూ.160 కోట్లకు అమ్ముడైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అప్పట్లో థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్న జైలర్ కు ఓటీటీలో 100కోట్లకు డీల్ కుదిరింది.
* పాండియన్ పవర్ ఫుల్
నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జైలర్’లో రజనీకాంత్ ముత్తువేల్ పాండియన్‌గా పవర్ఫుల్ పాత్రలో కనిపించారు. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం సినిమాకు మరింత బలాన్ని చేకూర్చింది. ముఖ్యంగా చిత్రంలోని పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించాయి.
థియేటర్లలో విడుదలకు ముందే ‘జైలర్’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. విడుదలైన తర్వాత కూడా ప్రేక్షకుల స్పందనతో సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లింది. రజనీకాంత్ స్టైల్, యాక్షన్ సన్నివేశాలు, నెల్సన్ మార్క్ టేకింగ్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దీంతో సినిమా డిజిటల్ హక్కులకు కూడా భారీ డిమాండ్ ఏర్పడినట్లు తెలుస్తోంది.
* అక్టోబర్ 16 విడుదల
అంతకుమించిన ధరకు డీల్ కుదరడం తమిళ చిత్రసీమలో అత్యంత భారీ ఓటీటీ డీల్స్‌లో ఒకటిగా నిలిచింది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌ను అక్టోబర్ 15, 2026న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు

Please tell us what is wrong. Your report will be sent to the website team.
