* నేడు గాల్ బ్లాడర్ సర్జరీ
ఆకేరు న్యూస్, హనుమకొండ : దివంగత ప్రజా గాయకుడు గద్దర్ సతీమణి విమల గాల్ బ్లాడర్ సమస్యతో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. మూడు రోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన ఆమెకు వైద్యులు నేడు సర్జరీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ కొద్దిసేపటి క్రితం నిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్ బీరప్పను కలిసి విమల కు అందుతున్న వైద్య సేవలు గురించి ఆరా తీశారు. విమల వెంట కుమారుడు సూర్యం, కుటుంబ సభ్యులు ఉన్నారు.
