* పేరు మార్చుకునేందుకు సిద్ధం
* ప్రజలు అలా ఎందుకు చేశారో అర్థం కావడం లేదు
* ముద్రగడ పద్మనాభం
ఆకేరు న్యూస్, కాకినాడ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. 164 శాసనసభ, 21 లోక్సభ స్థానాల్లో విజయదుందుబి మోగించింది. ఈనేపథ్యంలో ఎన్నికల ముందు చేసిన శపథంపై ముద్రగడ(Mudragada Padmanabham) స్పందించారు. పిఠాపురంలో(Pithapuram) పవన్ను ఓడించకపోతే.. తన పేరును మార్చుకుంటానన్న మాటపై కట్టుబడి ఉన్నానని తెలిపారు. అన్న మాట ప్రకారమే.. తన పేరును పద్మనాభ రెడ్డిగా (Padmanabha Reddy) మార్చేందుకు గెజిట్ పేపర్స్ రెడీ చేసినట్లు వెల్లడించారు. రెండు, మూడు రోజుల్లో దరఖాస్తు చేయబోతున్నట్లు తెలిపారు. తన పేరు మారిన తర్వాత మళ్లీ ఆ వివరాలు తెలుపుతానన్నారు. కానీ.., తనను ఉప్మా పద్మనాభం పదే, పదే ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటికి వచ్చిన వారికి టిఫిన్ పెట్టి మర్యాద చేయడంలో తప్పు లేదని, తన తాతలు, తండ్రి కాలం నుంచి ఈ ఆనవాయితీ వస్తోందని వెల్లడించారు. జగన్ పై ఓటమి కూడా స్పందించారు. కోట్లాది రూపాయాలతో ప్రజలకు సంక్షేమాన్ని అందించిన సీఎం జగన్ మాత్రమేనని.. దేశంలో మరెవరూ ఇలాంటి సాహసం చేయలేదన్నారు ముద్రగడ. కానీ ప్రజలు ఎందుకు ఓట్లు వేయలేదో అర్థం కావడం లేదు. ప్రజల ఫోకస్ సంక్షేమం కన్నా అభివృద్ధిపై ఉందా..? లేకపోతే వైసీపీకి మించి కూటమి సంక్షేమాన్ని ఆఫర్ చేయడం వల్ల అటు మొగ్గారో తెలియడం లేదన్నారు. జగన్ తోనే తన రాజకీయ ప్రమేయం ఉంటుందని పేర్కొన్నారు.
—————————-