Road Safety Awareness Rally
* ఏఎంవిఐ శ్వేత రెడ్డి
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
రోడ్డు భద్రత, నియమ నిబంధనలు పాటించి ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్వేతా రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలో బుధవారం విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి గాంధీ సెంటర్ లో మానవ హారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాహనాలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని, హెల్మెట్ ధరించాలని, అతివేగాన్ని తగ్గించాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదని సూచించారు. ఈ అవగాహన ర్యాలీ, మానవహారంలో సిఐ.జి వేణు, ఎస్సైలు వినయ్, రమేష్, మనీషా మన విద్యాధికారి కొమురయ్య జిల్లా ఐఈసిఓ నాగరాజు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.

1 thought on “STATION GHANPUR | విద్యార్థుల ర్యాలీ,మానవహారం”