Station Ghanpur MEO Kusuma Ramesh
* స్టేషన్ ఘన్పూర్ నూతన ఎంఈవో కుసుమ రమేష్
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్పూర్ : విద్యాభివృద్ధిలో మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని నూతన ఎంఈవో కుసుమ రమేష్ అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ ఎంఈవోగా ఆయన మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. మండల పరిధిలోని శివునిపల్లి జడ్పీ హెచఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రమేష్ ఎంఈవోగా నియామకమయ్యారు. ఇంతకుముందు ఎంఈవోగా ఉన్న చాగల్ హైస్కూల్ హెచఎం గొర్రె కొమురయ్య ఆగస్టు 31న ఉద్యోగ విరమణ చేశారు. ఆ స్థానంలో రమేష్ నియామకమయ్యారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను విద్యార్థులకు అందిస్తానన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉపాధ్యాయులు సహకరించాలని కోరారు. కే.రమేష్‌కు రిటైర్డ్ ఎంఈవో కొమురయ్య, పలువురు ఉపాధ్యాయులు, ఎమ్మార్సీ సిబ్బంది సన్మానించారు. కార్యక్రమంలో పి.వెంకటేశ్వర్లు, శ్రీనాథ్, శ్రీనికాంత్, ఫకీర్ దాస్, శ్రీనికాంత్, రవి, గిరి, సునీత, శ్రీలత, లవన్, వెంకటేశ్వర్లు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
