BJP President Grand Welcome
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ లో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడికి ఆ పార్టీ శ్రేణులు బుధవారం ఘన స్వాగతం పలికారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో రేపు పార్లమెంటులో ప్రవేశపెడుతున్న నారీశక్తివందన్ బిల్లుపై వరంగల్లో సమావేశానికి వెళుతున్న రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచందర్ రావుని స్టేషన్ ఘ న్ పూర్ నియోజకవర్గం బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ కార్యకర్తలతో కలిసి డివిజన్ కేంద్రంలో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అసెంబ్లీ పరిధిలోని జఫర్గడ్, చిల్పూర్, రఘునాథపల్లి, ధర్మసాగర్ మండల నాయకులతో కలిసి స్థానిక సమస్య లను రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు వివరించారు.
తన దృష్టికి వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కారిస్తానని అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు ని కలిసిన వారిలో మండల అధ్యక్షుడు సట్ల వెంకటరమణ, జాతీయ నాయకులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కళ్యాణ్ నాయక్, పార్లమెంట్ కోకన్వీనర్ యుగంధర్ రెడ్డి, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రడపాక ప్రదీప్, జఫర్గడ్ మండల అధ్యక్షుడు నగేష్, చిలుపూరు మండల అధ్యక్షుడు గంటే ఉపేందర్, ధర్మసాగర్ మండలాధ్యక్షుడు కుమార్ నాయకులు గాజుల సంపత్, కందిమల్ల కృష్ణమూర్తి, రాజేష్ రెడ్డి, ఆమంచ మధుసూదన్, పాలకుర్తి సోమశేఖర్, తాళ్లపల్లి కిషోర్, కళ్యాణ్ మహేందర్, ఉడుత రంజిత్, రజనీకర్, రమేష్, గుర్రాల శీను, మాచర్ల అనిరుధ్, బూర్ల అనిల్, వైట్ల రమేష్, అయ్యప్ప పరమేష్, కార్యకర్తలు పాల్గొన్నారు.

1 thought on “STATION GHANPUR | రాంచందర్ రావు పర్యటన”