Rajaiah warning anti party activities
* పార్టీ వ్యతిరేక విధానాలకు పాల్పడితే చర్యలు తప్పవు
… మాజీ ఎమ్మెల్యే రాజయ్య
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
పార్టీ వ్యతిరేక విధానాలకు పాల్పడితే చర్యలు తప్పవని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ టి రాజయ్య హెచ్చరించారు.
జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలోని వరలక్ష్మి ఫంక్షన్ హాల్ లో ముఖ్య నాయకులు, కార్యకర్తలు సమావేశం బుధవారం జరిగింది. సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంతమంది నాయకులు పార్టీ విధి విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని వారిపట్ల చర్యలు తప్పు అన్నారు. కార్యకర్తలందరిని కాపాడుకునే బాధ్యత నాది నన్ను కాదని ఈ నియోజకవర్గంలో ఎవరు అడుగు పెట్టలేరు అన్నారు. చాలామంది నాయకులు స్టేషన్ ఘనపూర్ మీద కన్ను వేశారు అన్నారు.
కానీ అసలు పెద్ద కన్ను రాజయ్యది అలాటిది ఎవడైనా ఇక్కడ అడుగు పెడుతాడా అని హెచ్చరించారు. జనగాం, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే ఎలక్షన్ లో స్టార్ క్యాంపై గా ఇస్తే రెండు నియోజకవర్గాలలో గెలిపించిన ఘనత నాది అన్నారు. రాజయ్య నీ మోసం చేసిన వాడు ఎవ్వడు బాగుపడడని జోష్యం చెప్పారు. నాకు రాజకీయ జన్మనిచ్చింది వై యస్ రాజశేఖర్ రెడ్డి అయితే… కెసిఆర్ దేవుడు తో సమానం అన్నారు.
పార్టీకి వ్యతిరేక విధానాలు చేసిన వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని, పార్టీకి మోసం చేసిన కడియం శ్రీహరి మీ గ్రామంలో అడుగుపెడితే అడ్డుకోండి అని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎడవల్లి కృష్ణారెడ్డి, మాలోత్ రమేష్ నాయక్, కేశిరెడ్డి మనోజ్ రెడ్డి, రాజన్ బాబు, సురేష్ కుమార్, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇంకా చదవండి…
