Puri rath yatra
Published:
* 120 మందికి పైగా గాయాలు
ఆకేరు న్యూస్, డెస్క్: ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భక్తులు అశేషంగా తరలిరావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది.
ఈ ప్రమాదంలో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరై ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో 120 మందికి పైగా భక్తులు గాయపడ్డారు.
సమాచారం అందుకున్న అత్యవసర ప్రత్యేక సహాయక బృందాలు రంగంలోకి దిగి క్షతగాత్రులను తక్షణమే ఆసుపత్రికి తరలించాయి. ప్రస్తుతం అక్కడ ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
