christopher nolan - The Odyssey Movie
* ‘ది ఒడిస్సీ’ కోసం ప్రపంచం ఎందుకు ఎదురుచూస్తోంది?
* గ్రీకు ఇతిహాసం ఇప్పుడు భారీ విజువల్ ఎపిక్గా!
ఆకేరు న్యూస్, డెస్క్:
హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ‘ది ఒడిస్సీ’ (The Odyssey) సినిమా జూలై 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రిలీజ్కు ముందే ఈ సినిమాపై ఊహించని స్థాయిలో హైప్ నెలకొంది. భారత్లో కూడా IMAX షోల టికెట్లు వేగంగా అమ్ముడవుతుండగా, కొన్ని చోట్ల రూ.2,000 నుంచి రూ.3,000 వరకు ధర ఉన్నా ప్రేక్షకులు వెనక్కి తగ్గడం లేదు.
* అసలు కథ ఏంటి?
ట్రాయ్ యుద్ధం ముగిసిన తర్వాత తన స్వదేశానికి తిరిగి వెళ్లే వీరుడు ఒడిస్సియస్ ఎదుర్కొన్న సాహసాలే ఈ సినిమా కథ. సముద్ర ప్రయాణం, యుద్ధాలు, రాక్షసులు, దేవతల పరీక్షలు, తెలివితేటలతో కూడిన ప్రయాణాన్ని హోమర్ రాసిన ప్రపంచ ప్రఖ్యాత గ్రీకు ఇతిహాసం ఆధారంగా నోలన్ తెరపై ఆవిష్కరించారు.
* నోలన్ కెరీర్లోనే భారీ సినిమా!
సుమారు 250 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.2,100 కోట్లకు పైగా) వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించినట్లు హాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. గ్రీస్, ఇటలీ, మొరాకో వంటి దేశాల్లో సహజ లొకేషన్లలో చిత్రీకరణ జరిపారు. అత్యాధునిక IMAX 70mm టెక్నాలజీతో తెరకెక్కడం ఈ సినిమాకు మరో ప్రత్యేక ఆకర్షణ.
* స్టార్ కాస్ట్..
ఈ చిత్రంలో మ్యాట్ డామన్, టామ్ హాలండ్, యాన్ హాతవే, జెండయా, రాబర్ట్ ప్యాటిన్సన్, చార్లీజ్ థెరాన్ వంటి హాలీవుడ్ స్టార్లు కీలక పాత్రల్లో నటించారు.
* ఎందుకింత హైప్?
‘ఇంటర్స్టెల్లార్’, ‘ఇన్సెప్షన్’, ‘ఓపెన్హైమర్’ తర్వాత నోలన్ నుంచి వస్తున్న మరో భారీ విజువల్ ఎపిక్ కావడం, భారీ బడ్జెట్, ప్రపంచ ప్రఖ్యాత ఇతిహాసాన్ని తెరపై ఆవిష్కరించడం వల్లే ‘ది ఒడిస్సీ’ ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
