Karate Summer Camp Station Ghanpur
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలో ఈనెల 20 నుండి కరాటే సమ్మర్ క్యాంపు నిర్వహించినట్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు, మాస్టర్ పెసరు సారయ్య తెలిపారు. డ్రంకెన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ షావలిన్ కుంగ్ ఫు ఆధ్వర్యంలో కరాటే సమ్మర్ క్యాంప్ స్థానిక బాలికల పాఠశాలలో ఏప్రిల్ 20 నుండి ప్రారంభ కానుంది నేటి సమాజంలో మార్షల్ ఆర్ట్స్ బాలబాలికలకు ఎంతో అవసరం చదువుతోపాటు మార్షల్ ఆర్ట్స్ వల్ల ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు. ప్రత్యేక శిక్షణ స్టిక్ ఇండియన్ స్టిక్ జిమ్నాస్టిక్ కటాస్ స్పారిళ్లలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆయన వెంట వంగ శ్రీను, గోనెల ఉపేందర్, ఎండి రజాక్, పొన్న శివ, జావిద్, చిలగాని శ్రీశాంత్ పాల్గొన్నారు.
ఇంకా చదవండి…
